Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ
నవతెలంగాణ-నల్లగొండ
దేశంలో మహిళలకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఐద్వా ఆధ్వర్యంలో మహిళా జూనియర్ కళాశాలలో మహిళలపై హింస- మానవ హక్కులు కాపాడుకుందాం.
రక్షణ చర్యలలో ప్రభుత్వాల పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో 8 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలను రెండవ పౌరురాలుగా చూస్తున్నారని, విద్యార్థులను, మహిళలకు రక్షణ కల్పించడంలో నిందితులను శిక్షించడంలో ఘోరంగా విఫలం చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి కఠినమైన శిక్షలు విధించడం లేదని ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐద్వా పట్టన కార్యదర్శి భూతం అరుణ కుమారి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు వస్తున్నప్పటికీ నేడు మనువాద భావజాలం కలిగిన ప్రభుత్వాల వలన చిన్నచూపు చూస్తున్నారన్నారు. కాలేజీలలో సీసీ కెమెరాల వెంటనే ఏర్పాటు చేయాలని వాటికి అవసరమైన నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాలని కోరారు. టీములు ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థినులను మహిళలను చైతన్యవంతం చేయడానికి స్వచ్ఛంద సంఘాలు మహిళా సంఘాలను కలుపుకొని సదస్సులు నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా చైతన్యవంతులను చేయడానికి కార్యక్రమాలు విస్తృతంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ హాస్టల్ వార్డెన్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.