Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
వికలాంగుల అభ్యున్నతి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమని వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు నేండ్ర మల్లారెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ తల్లి సెంటర్ వద్ద టీఆర్ఎస్ నాయకులతో కలిసి వికలాంగులు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వచ్చాక వికలాంగులను గుర్తించి, ఉచిత విద్య, ఉపాధి పింఛన్లు, వాహనాలు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, కటకం వెంకటేశ్వర్లు, చెరుకు పరమేష్, తడకమల్ల రవికుమార్, మధు, శ్రీకాంత్, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కటకం బ్రహ్మచారి, షేక్ సయ్యద్, నాయకులు జలగం శ్రీరాములు, మండల అధ్యక్షులు గుండాల కోమరయ్య, నాయకులు మామిడి విజరు, గోసుల వెంకన్న, జటంగి మల్లయ్య, అవిలయ్య ఉద్యమ నాయకుడు సురుగు ఉప్పలయ్య తదితరులు పాల్గోన్నారు.