Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
విద్యార్థులు లక్ష్యంతో చదివి గొప్ప శాస్త్రవేత్తలు కావాలని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, డీఈవో అశోక్ అన్నారు. బుధవారం రాత్రి స్థానిక ఏవీఎం పాఠశాలలో మూడు రోజుల పాటు జరిగిన విద్యావైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సభలో వారు మాట్లాడారు. చదువులో విద్యా వైజ్ఞానిక ప్రదర్శలు ప్రతిభను వెలికి తీస్తాయన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు పలువురుని ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా జయా పాఠశాల లో 9 వ తరగతి చదువుతున్న షేక్ ముత్తాహార్ బెస్ట్ ఎడ్యుకేషన్ స్పీకర్గా జిల్లా ప్రధమ బహుమతి పొందారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ జహీర్ ముత్తాహార్ను అభినందించారు. అనంతరం విద్యార్దికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, పీవీసీ ఎండి మీలా మహదేవ్, విద్యాశాఖ ఎడి శైలజ, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోటి రెడ్డి, కో కన్వినర్లు, ఎంఈవోలు,ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్దులు పాల్గొన్నారు.