Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
నవతెలంగాణ-నేరేడుచర్ల
మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులలో నాణ్యత పాటించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను గురువారం జిల్లా కలెక్టర్ పర్యవేక్షించారు. మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో గల నర్సరీని పరిశీలించి రానున్న హరిత హారినికి కావాల్సిన మొక్కలను సిద్ధం చేయాలని అధికారులకు సూచిచారు. రామపురంలో ఏర్పాటు చేసే భస్తీ దవఖాన బిల్డింగ్‌ను పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని పాతనేరేడుచర్ల సమీపంలో కోటి రూపాయలతో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులను పరిశీలించి మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలోని రేషన్ దుకాణంలో స్టాక్ వివరాలను, రికార్డులను, తూకాన్ని పరిశీలించారు.మున్సిపాలిటీ పరిధిలో మెకానైజ్డ్ దోబీ ఘాట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థానిక విజయ దుర్గా ఆలయంలో విగ్రహా ప్రతిష్ట మహౌత్సవంలో కలెక్టర్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తాహసీల్దార్ సరిత, ఎంపీడీవో శంకరయ్య, ఎంఈవో చత్రూ నాయక్, ఎంపీఓ విజయ కుమారి ఏపీవోబాల్తు శేఖర్ డీటీ నల్లబోలు శ్రవంతి, ఆర్ఐ ప్రవీణ్ కుమార్, కౌన్సిలర్ లు కొణతం చిన్న వెంకటరెడ్డి,రణపంగ నాగయ్య, తాళ్లూరి సాయి, ఆలయ కమిటీ చైర్మన్ కొణతం ఆదిరెడ్డి, కోశాదికారి నాగండ్ల శ్రీదర్ తదితరులు పాల్గొన్నారు.