Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
నూతన కలెక్టరేట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సద్దలచెరువు, మినీ ట్యాంక్ బండ్, మురుగునీరు శుద్ధి కేంద్రం, ప్రభుత్వ వైద్య కళాశాల అభివృద్ధి పనులను ప్రారంభించి 5 సంవత్సరాలు గడుస్తున్న అవి ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి నెలకొందని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక 9వ వార్డులో పాలడుగుల పరుశురాములు, చోక్కయ్యగౌడ్ల ఆధ్వర్యంలో వార్డు వార్డుకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ పనులు సగం కూడా జరగకపోవడం దారుణం అన్నారు. వార్డులో మౌలిక సదుపాయాలు కల్పించడంలో మున్సిపల్ చైర్ పర్సన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని పేదలను ఆదుకునేలా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీ ఉల్లా, వెలుగు వెంకన్న, నామ ప్రవీణ్, పిల్లల రమేష్ నాయుడు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.