Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్/సూర్యాపేటకలెక్టరేట్/నల్లగొండ
మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో నాణ్యతతో పనులు చేపట్టి అందంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం రాష్ట్ర విద్యాశాఖ వసతుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, రాష్ట్ర విద్యా శాఖ సంచాలకులు దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి మంత్రి మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఆర్.అండ్.బి., పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లతో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో యాదాద్రిభువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఈ శంకరయ్య, పంచాయతీరాజ్ శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ఆండాలు, మండల నోడల్ అధికారులు పాల్గొన్నారు.సూర్యాపేట జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ , డిఈఓ అశోక్, పి ఆర్ ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ రమేష్, మన ఊరు మన బడి ప్రతేక్య అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.నల్లగొండ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బు గుప్తా, డీఈఓ బిక్షపతి, పీఆర్, ఆర్ ఆండ్బీ ఈఈలు పాల్గొన్నారు.