Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని 13వ వార్డుకు చెందిన కందుకూరి హరీష్‌కు దళిత బంధు యూనిట్ ద్వారా మెడికల్ అండ్ జనరల్ స్టోర్ వచ్చింది. గురువారం మున్సిపల్ కేంద్రంలోని మార్కెట్ గేటు ఎదురుగా శిఖర మెడికల్ అండ్ జనరల్ స్టోర్ షాప్‌ను రాష్ట్ర మహిళా నాయకురాలు, తిరుమలగిరి మున్సిపల్ చైర్ పర్సన్ రజిని రాజశేఖర్ ప్రారంభించి మాట్లాడారు. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతగానో తోడ్పడుతున్నారన్నారు. కెేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకొని సంతోషంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మెన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, కౌన్సిలర్ సరిత నాయకులు నరోత్తం రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.