Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు ఏర్పాట్లను పూర్తి చేయాలి
- అదనపు కలెక్టర్ ఖుష్భూ గుప్తా
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న నల్లగొండ మున్సిపాలిటీలో లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించారని, అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్త సూచించారు. గురువారం నల్లగొండ మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్‌తో కలిసి లక్ష మొక్కలు నాటే కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సోమవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, సీడీఎంఏ డాక్టర్ ఎన్.సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ వినరు కష్ణారెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. అధికారులు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం నిర్వహించే ప్రతిచోట స్టేజ్ ఏర్పాటు చేయాలని, మొక్కలను అందుబాటులో ఉంచాలని, బ్యానర్లు, నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కేవీ .రమణాచారి మాట్లాడుతూ కార్యక్రమానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు వివరించారు. మొక్కలు నాటే కార్యక్రమం మొదటగా ఎస్ఎల్బీసీ స్టేజి నుండి ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మసాద్ అహ్మద్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.