Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
వృత్తి విద్య కోర్సులైన ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ ఎంబిబిఎస్ చదివే బీసీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం లేదని బీసీ విద్యార్థులపై ఎందుకు వివక్ష అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ ప్రశ్నించారు. గురువారం బీసీ విద్యార్థి యువజన, పోరుయాత్ర మండల కేంద్రంకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బస్స్టాండ్ సెంటర్లో మాట్లాడుతూ ప్రయివేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదని పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు న్యాయం చేయట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎమ్మెల్యేల జీతాలు పెంచుకున్నారే అదే తరహాలో పేద పిల్లల మెస్ ఛార్జీలు పెంచడంలో నిర్లక్ష్యం ఎందుకు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వేముల నరసింహ గౌడ్, జి.వెంకన్న, జిల్లా నాయకులు కొప్పు బాలకృష్ణ గౌడ్, మండల అధ్యక్షులు ముద్దం నరసింహ, చెన్నారం సత్తయ్య జీరి పోతుల వీరేశం, ఊదరి లింగయ్య పెద్ద గొల్ల, సిగ బిక్షం పాల్గొన్నారు.