Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ధిరావత్ రవినాయక్
నవతెలంగాణ-మిర్యాలగూడ
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ అధ్వర్యంలో మండలంలోని అవంతిపురం గురుకుల పాఠశాలలో గురువారం నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్కు ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దిరావత్ రవినాయక్ ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. జాతీయ నూతన విద్యా విధానం వల్ల పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. నూతన విద్యా విధానంలో ఉన్నత విద్య కోర్సులలో కులవృత్తులను చేర్చి విద్యార్థులకు శాస్త్ర విద్యా విధానాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తెస్తుందని తెలిపారు. శాస్త్రీయ విద్యా విధానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి గాని పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేసే నూతన జాతీయ విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసేంతవరకు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు మూడవత్ రవినాయక్, నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదా నాయక్, అజరు కుమార్, టౌన్ కార్యదర్శి జగన్, దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న, శ్రీను, సార్, నాయకులు ఉపేందర్, మోహన్, తరుణ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.