Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య యూఎస్పీసీ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-నల్లగొండ
జిల్లాలో అక్రమ డిప్యూటేషన్లను తక్షణమే రద్దు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సోమయ్య డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని డీిఈఓ కార్యాలయం ముందు యూఎస్‌సీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు, వారి సబ్జెక్టు అవసరాల నిమిత్తం ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు నల్లగొండ జిల్లాలో కొందరి ఉపాధ్యాయుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగపడేటట్టుగా డీఈవో నిబంధనలకు విరుద్ధంగా ఓరల్ డిప్యూటేషన్లు ఇచ్చారన్నారు. విద్యా వ్యవస్థను కాపాడాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వం ఉత్తర్వులను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడడం సరికాదని, తక్షణం ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్న అన్ని రకాల డిప్యూటేషన్లను రద్దు చేయాలని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్ రెడ్డి, జీ.నాగమణి, యూఎస్పీసీ నాయకులు వై. సైదులు, కెే. రత్నయ్య, ఎండీ.కుర్షిద్మియా, పీ.వెంకటేశం, పీ.వెంకులు, ఏడుకొండలు, బీ. శ్రీనివాసచారి, బీ.అరుణ, ఎన్.శేఖర్‌రెడ్డి, డీ.గణేష్, ఎన్.సరళ, కే. వీరయ్య, పౌర స్పందన వేదిక జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, యూఎస్పీసీ సభ్య సంఘాల జిల్లా, మండలాల బాధ్యులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.