Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని, అర్హులైన ఓటర్లను ఓటర్ జాబితాలో నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం స్వీప్ అధికారి భవానీ ప్రసాద్ అన్నారు. గురువారం నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో స్వీప్ కార్యక్రమాల పై ఆయన అర్డిఓ, ఇతర అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా అర్హులైన ఓటర్లు జాబితాలో నమోదు, ఓటర్ జాబితాలో మార్పులు,చేర్పులు దరఖాస్తు చేయడంపై ఓటర్లకు అవగాహన కలిగించాలని,సోషల్ మీడియా ద్వారా ఎన్నికల కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. సెక్స్ వర్కర్లు, ట్రాన్స్ జెండర్లు, వికలాంగులు ఓటర్గా నమోదుకు సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. తొలుత నల్లగొండ పట్టణంలోని చెన్న కేశవ పాఠశాల, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశా లలో పోలింగ్ బూత్లు సందర్శించి బీఎల్ఓలు పని తీరు పై తెలుసుకుని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయ చంద్ర రెడ్డి, డీఈఓ బిక్షపతి, డీపీఆర్వో శ్రీనివాస్,డిప్యూటీ డీఎంహెచ్ ఓ వేణు గోపాల్ రెడ్డి, తహశీల్దార్ నాగార్జునరెడ్డి, ఎన్నికల డీటీ విజరు, మహిళా, శిశు సంక్షేమశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.