Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
అడవిశాఖ సిబ్బంది చట్ట అతిక్రమణ నివారించాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దిరావత్ రవినాయక్ కోరారు. గురువారం తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో అటవీ హక్కు చట్టం 2006 ప్రకారం పలు గ్రామసభలు నిర్ధారించిన లబ్ధిదారుల జాబితాను ఎస్డీఎల్సీ సమావేశంలో ఆమోదించే క్రమంలో ఆర్డీవో అధ్యక్షతన జరగనున్న సమావేశంలో అడవి శాఖ సిబ్బంది చట్ట విరుద్ధంగా గూగుల్ మ్యాప్ పరిశీలన పేరుతో అర్హులను, లబ్ధిదారు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. అడవి సిబ్బంది చెబుతున్న గూగుల్ మ్యాప్ పరిశీలన అనే విషయం మాత్రమే చట్టంలో పేర్కొనలేదని గూగుల్ మ్యాప్ అర్హత నిర్ధారిస్తుందని శాఖ సిబ్బంది చెప్పడం చట్టా విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై ఆర్డీవోకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్రంలోని పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అటవీ అధికారులు అతి ఉత్సాహం వలన అర్హులైన గిరిజన పాలిట శాపంగా మారిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు రవి నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు పాల్గొన్నారు.