Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ-సూర్యాపేట
నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం బాజకుంట గ్రామానికి చెందిన అధికార పార్టీ అగ్రకుల సర్పంచ్ ఈదునూరి సరిత వికలాంగుడైన, దళితుడిపైన చెప్పు తీసుకొని విచక్షణారహితంగా కొట్టడం దుర్మార్గమని, వెంటనే సర్పంచ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నార్కెట్‌పల్లి మండలంలోని బాజకుంట గ్రామంలో దళిత కుటుంబాలకు ఇచ్చిన దళిత బంధు కింద లబ్ధిదారుల నుండి సర్పంచ్ డబ్బులు వసూలు చేయడం దుర్మార్గం అన్నారు. గ్రామానికి చెందిన వర్కర్ల సైదులు దళిత వికలాంగులు ముందుగా 5000 రూపాయలు డబ్బులు ఇచ్చి మిగతావాళ్లు ఇవ్వలేదని తెలుసుకొని ముందుగా ఇచ్చిన డబ్బులను తిరిగి నాకు ఇవ్వాలని ప్రశ్నించినందుకు చెప్పుతూ దాడి చేసి కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అందరూ చూస్తుండగానే దాడి చేసిన సర్పంచ్‌పై కేసు నమోదు చేయకపోవడం సరైనది కాదన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, జిల్లా సహాయ కార్యదర్శి పిండిగ నాగమణి, దుర్గారావు, జిల్లా కమిటీ సభ్యులు రమణ, గిరి తదితరులు పాల్గొన్నారు.