Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజి మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఐఎన్ టీయూసీ ఎల్లవేళలా కార్మికులకు అండగా నిలుస్తుందని, కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని మాజి మంత్రి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల, కార్యవర్గ సభ్యులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అనుబంధ కార్మిక సంఘం ఐఎన్ టీయూసీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1985 లో తాను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గా గెలిచినప్పటి నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఐఎన్ టీయూసీ బలోపేతానికి కృషి చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు యరగాని నాగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండపల్లి సాగర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రెబల్ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్ బైరు శైలేందర్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
యువత స్వశక్తితో ఎదగాలి..
యువత స్వశక్తితో ఎదిగి ఆర్థికంగా ఉపాధి పొందాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల, కార్యవర్గ కమిటీ సభ్యులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక డీమార్ట్ పక్కన గల ఎవలస్ హెయిర్ సెలూన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత ఉద్యోగాల కోసం చూడకుండా తన సొంత కాళ్ళ మీద బతికే విధంగా స్వశక్తితో ఎదగాలని కోరారు. వినియోగదారుల మన్ననలను పొంది మరింత ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల వెంకటరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తంగేళ్ల కరుణాకర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి నాగల వాసు సత్యనారాయణరెడ్డి, నిర్వాహకులు పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.