Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపడమే ఆరాధ్య పౌండేషన్ లక్ష్యమని వ్యవస్థాపక అధ్యక్షులు తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆరాధ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ వ్యాప్తంగా 8వేల మందికి పోస్టల్ ప్రమాద బీమా పథకం పేద ప్రజలకు బాండ్లు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నిరు పేదలు ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే ఆ కుటుంబం రోడ్డునపడే పరిస్థితి ఎదురవుతుందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. నిరుపేదలకు ఉచితంగా పోస్టల్ ప్రమాద బీమా చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరాద్య ఫౌండేషన్ సభ్యులు విజరు, కళాకారుడు గిద్దె రాంనరసయ్య, యాదగిరి, మద్దిరాల మండల ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు కట్కోజు నాగరాజు, తునికి బద్రి, తన్నీరు మహేష్, కొండ మధు, భారీ సంఖ్యలో ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.