Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-చిట్యాల
అభివృద్ధి పథంలో కేసీఆర్ పాలన ఉందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండలం పేరేపల్లి గ్రామంలో 45 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, అంగన్వాడీ బిల్డింగ్, సీసీ కెమెరాలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుంకర ధనమ్మ యాదగిరి గౌడ్, ఎంపీపీ కొలను సునీత వెంకటేష్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.