Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పజ్జురు ఉపేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు బూరుగు లక్ష్మమ్మ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకీ మహిళలపై వేధింపులు తీవ్రమవుతున్నాయన్నారు. నిర్భయ లాంటి చట్టాలు అనేకం వచ్చినా దాడులు ఆగడం లేదన్నారు. నిర్భయ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి, మహిళపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు మాగి చైతన్య, అంబటి సునీత, మామి రోజు నాగమణి, కలమ్మ పాల్గొన్నారు.