Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలం కొర్లపహాడ్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సుమారు వందమంది ఆదివారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూరాష్ట్రంలోని గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే అది టీిఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి అండగా ఉండి రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించాలన్నారు. పార్టీలో చేరిన వారిలో గుడిపెల్లి నరేందర్‌రెడ్డి, వంటేపాక కళ్యాణ్, గుత్త దామోదర్‌రెడ్డి, వంటేపాక రాజు, సురారాపు లింగరాజు, బొజ్జ సందీప్, ఎడ్ల నవీన్, రావుల సైదులు, అనుముల శివ శంకర్, మాచర్ల నరేందర్, మాదాసు జానయ్య తదితరులు ఉన్నారు.