Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీకవుతున్న మిషన్ భగీరథ పైపులు
- పట్టించుకోని అధికారులు
- రోగాల బారిన పడుతున్న ప్రజలు
నవతెలంగాణ -తిరుమలగిరి సాగర్
ఇంటింటికీ శుద్ధిచేసిన జలాలను అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం 'మిషన్ భగీరథ' పథకాన్ని తీసుకొచ్చింది. కానీ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జలాలు కలుషితమవుతున్నాయి. పైపులైన్ నిర్మాణం లో జాగ్రత్తలు పాటించకుండా ఇష్టానుసారంగా వేయడంతో, పైపులు లీకవుతున్నాయి. లీకైన ప్రదేశంలో మురుగునీరు చేరి మంచి నీళ్లు కలుషితమవుతున్నాయి. మండల కేంద్రంలో రామాలయానికి వెళ్ళే వీదిలోగత ఉప ఎన్నికకు ముందు తాగునీటి కోసం మిషన్ భగీరథ పైపులైన్ వేశారు. వేసిన సంవత్సరం తరువాత పైపు లైన్ కు వాటర్ కనేక్షన్ ఇచ్చారు. పైపులైన్ నిర్మాణం సమయంలో అదికారుల నిర్లక్ష్యం , కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వేయ డంతో పైపులు లీకవుతున్నాయి. దీంతో నీళ్లు విడిచిన ప్రతిసారి పైపు లీకైన చోట గుంతలు నిండి బురద తయారవడం, ఆ తర్వాత నల్లాలు బంద్? చేస్తే అదే బురద నీరు పైపులైన్ లోకి చేరి ఇండ్లకు సరఫరా అవుతున్నాయి. దీంతో కొన్ని దిక్కుల రంగు మారిన నీళ్లు వస్తున్నాయని, ఆ కలుషిత నీళ్లు తాగి తాము రోగాల బారిన పడుతున్నామని ప్రజలు ఆరపిస్తున్నారు. ఇకనైన అదికారులు వెంటనే స్పందించి పైపులు లీకైన చోటరిపేర్లు చేసి శుద్ద జలాలను అందించాలని ప్రజలు కోరుతున్నారు.