Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-మఠంపల్లి
అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శీను అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జరిగిన మండలకమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం ఏజెన్సీల పెండింగులో ఉన్న బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలని, గుడ్డుకు రూ.8 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్నివర్గాల కార్మికుల, గ్రామపంచాయతీ కార్మికుల, భవన నిర్మాణ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సమావేశ అధ్యక్షురాలు శాంతకుమారి, సీఐటీయూ మండల కన్వీనర్ సయ్యద్ రన్ మియా, భూక్య పాండునాయక్, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోత్ బాలూనాయక్, సీఐటీయూ నాయకులు కోళ్ల గురువారెడ్డి, మేడి దేవదానం, గోవిందమ్మ, బీ.పాండు, అశోక్, కొమ్ము కోటయ్య, అమరారపు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.