Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ -ఆలేరుటౌన్
యాదాద్రి భువనగిరి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం రఘునాధపురం రోడ్డులో ఏర్పాటుచేసిన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య తొలి అమరుడు అన్నారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో యువత ఆయన ఆశయ సాధన కృషి చేయాలన్నారు. కురుమల అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బాల్య వివాహాలు రూపుమాపలని కురుమలకు విజ్ఞప్తి చేశారు.టీిఆర్‌ఎస్ ప్రభుత్వం కురుమలని గౌరవించుకుంటుందన్నారు. దొడ్డి కొమరయ్య భవన నిర్మాణం కోసం మరో రెండున్నర కోట్ల నిధులు కేటాయించినట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంఘం, సమాజం,బడుగు బలహీన వర్గాల కొరకు పోరాడాలని, దొడ్డి కొమురయ్య ఆశయ సాధన కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతి వచ్చే సంవత్సరం నుండి అధికారికంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. కురుమల ఇలవేల్పు కొమురెల్లి మల్లన్న దేవాలయ చైర్మెన్‌్ పదవి కురుమలకే, కేటాయించామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కురుమలకు పెద్దపీట వేస్తుందన్నారు. ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహం ఏర్పాటు కోసం కృషిచేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు,ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో ఐదు ఎకరాల స్థలం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని, త్వరలోనే దొడ్డి కమరయ్య భవన నిర్మాణం పూర్తవుతుందన్నారు. కురుమ సంఘం రాష్ట్ర నాయకులు బండ్రు. విమల, బండ్రు శోభారాణి, బీర్ల ఐలయ్య, మాట్లాడుతూ కురుమలు ఐక్యతతో ముందుకు సాగాలన్నారు. కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గవ్వల నరసింహులు సభకు అధ్యక్షత వహించారు. అంతకుముందు శ్రీ కనకదుర్గ ఆలయం నుండి సభా వేదిక వరకు డప్పు చప్పులతో, మేళా తాళాలతో, బాణాసంచా కాల్చుతూ ఊరేగింపుగా సభా వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, యాదగిరిగుట్ట జెడ్పీటీసీ తోటకూర అనురాధ,కురుమ సంఘం నాయకులు రేగు మల్లేశం,క్యామ మల్లేశం, కర్రె వెంకటయ్య,జల్లి నరసింహులు, ఎగిడి. శ్రీశైలం, ఎగిడి మల్లయ్య, పత్తి వెంకటేష్, దయ్యాల సంపత, బందెల. సుభాష్, కూళ్ల వెంకటేష్, కుండే సంపత్, బొడ మహేష్ మల్లెల శ్రీకాంత్, నందా ఐలయ్య, రాజశేఖర్, జూకంటి సంపత్, ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు వార్డు కౌన్సిలర్లు కురుమ సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.
డయాలసిస్ సెంటర్ ప్రభుత్వాస్పత్రిని సందర్శించిన మంత్రి
అభివృద్ధి కోసం 90 లక్షల రూపాయల నిధులు మంజూరు కోరిన ప్రభుత్వ విప్ సునీత
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మండల కేంద్రంలో ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్ ను పరిశీలించారు. రోగులను వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలియజేశారు. వైద్య సిబ్బందితో ముచ్చటించారు. సిహెచ్సి సెంటర్ కు మరమ్మతుల నిమిత్తం 90 లక్షల రూపాయలు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ విపు,ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత సమస్యలను మంత్రికి వివరించారు.నిధులు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్యులు,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.