Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలిపోయిన పది వ్యవసాయ మోటార్లు
- ఇబ్బందుల్లో రైతులు
నవతెలంగాణ-ఆలేరురూరల్
ఆలేరు మండలంలోని శర్భనాపురం గ్రామంలో 30ఏండ్ల కిందట ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫారంను అధికారులు రైతులకు చెప్పకుండా మార్చేశారు. గతంలో రెండు స్తంభాలు నాటి ,పెద్ద గద్దె కట్టి దానిపై ట్రాన్స్ఫారం కూర్చోబెట్టారు .ఆ ట్రాన్స్ఫార్మర్ ద్వారా 15 బావులకు కరెంటు సరఫరా జరిగేది. గతంలో నిర్మించిన ట్రాన్స్ఫార్మర్కు ఆన్ ఆఫ్ స్విచ్ ఉండేది. అదికూడా తీసుకెళ్లారు. ఊరికి ఆనుకొని ఉన్న 18 ఎకరాల ఐదు గుంటలు ఉన్న భూమిలో ట్రాÛన్స్ఫార్మర్ తొలగించాలని వెంచర్ ఓనర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రైతులకు సమాచారం ఇవ్వకుండా తొలగించారు. దాని బదులు భూమి చివరిలో ఒక స్తంభం నాటి దాని ముందు మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. దానికి ఆన్ఆఫ్ స్విచ్ లేకపోవడంతో పదిరోజుల వ్యవధిలో పదిమోటార్లు కాలిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట నోటికాడికి రాగానే మోటార్లు కాలిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మోటార్లు బాగుచేయించాలంటే పదివేల రూపాయలు ఖర్చు వస్తుంది. పంట దిగుబడి సరిగా రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ మీద ఫీజు పోయిందంటే లైన్మెన్ కి ఫోన్ చేసి ఎల్సి తీసుకొని అప్పుడు ఫీజు వేయాల్సి వస్తోంది. రెండు రోజుల క్రితం ఫీజు కొట్టేసిన సమయంలో ట్రాన్స్ఫార్మర్ కింద నిప్పు రవ్వ పడడంతో చుట్టూ గడ్డి మొత్తం కాలిపోయింది. గమనించిన రైతులు మంటను ఆర్పేశారు. రెండు రోజులుగా నడవని బోర్లు బావులు రైతులు నారు పోసి ఎండబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మండల విద్యుత్ శాఖ అధికారికి ఫోన్ చేస్తే స్పందించడం లేదని రైతులు చెబు తున్నారు .ఎల్సి తీసుకొని ఫీజు ఏసేది ఎప్పుడు రైతులు బోర్లు ఆన్ చేసేదెప్పుడు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాణాలు పోతే గాని స్పందించరా..
కారే రాజు, రైతు
గతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ణు ఇటీవల వెంచర్ ఏర్పాటు కావడంతో విద్యుత్ అధికారులు వెంచర్ ఓనర్లకు కుమ్మక్కై రైతులకు సమాచారం ఇవ్వకుండా వేరే స్థలానికి మార్చారు. గతంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు, ఇప్పుడు ఉన్న ట్రాన్స్ఫార్మర్కు చాలా తేడా ఉంది. వర్షం పడ్డదంటే ఇప్పుడు ఉన్న దాని చుట్టూ నీరు ఉండి విద్యుత్ షాక్ కొడుతుంది. ఇటీవల రెండు గోర్లు విద్యుత్ షాక్ తో చనిపోయాయి. గొర్లు చనిపోతే సరే కానీ మనుషులు కూడా చనిపోతే కానీ సమస్యను పరిష్కరించరాని ప్రశ్నిస్తున్నారు.
నాలుగు సార్లు బోర్లు కాలిపోయాయి
ప్రవీణ్ గ్రామ కౌలు రైతు
వానకాలం పంట సాగు చేసి నాటు పెట్టే సమయానికి బోర్ కాలిపోయింది. ఎమిటి అని చూస్తే ట్రాన్స్ఫార్మర్ పక్కకు మార్చారు. దానికి ఆన్ ఆఫ్ స్విచ్ లేదు. మోటారు బాగుచేయించా మళ్లీ15 రోజులకే కాలిపోయింది. మళ్లీ రిపేర్ చేయించాను. మళ్లీ పది రోజులకే కాలిపోయింది. ఇలా రిపేరు చేయించినప్పుడల్లా రూ.10 నుండి 12వేల అవుతుంది.
స్పందించని అధికారులు
రమేష్ కారే రైతు
మోటార్లు కాలిపోతున్నాయని అధికారులకు ఫోన్ చేస్తే వారు ఫోన్ ఎత్తకపోవడం, ఎత్తినా పై అధికారులకు చెప్పమని సమాధానం చెబుతున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకునే విద్యుత్ శాఖ అధికారులు కరెంటు సమస్యలు తీర్చకపోవడం బాధాకరంగా ఉంది.
గత ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలి
మామిడల దేవేందర్- రైతు
అప్పుడు ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలి. రైతుల పర్మిషన్ లేకుండా తొలగించడం బాధాకరం. ఇప్పుడు ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దు.