Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ డాక్టర్లు ప్రయివేట్ ఆస్పత్రుల నిర్వహణపై ఆగ్రహించిన ప్రజాప్రతినిధులు
- చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని తీర్మానం
- మండలంలో బోగస్ ఓట్లు నమోదు చేశారని తహసీల్దార్‌పై ఆరోపణ
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్
చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రిలోని వైద్యులుప్రయివేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు.ప్రయివేట్ ఆస్పత్రుల్లో అర్హత లేని వారు వైద్యం చేస్తున్నారు.లింగనిర్ధారణ పరీక్షలు కూడా చేస్తున్నారు.మిషన్ భగీరథ పథకంలో ఇంటింటికి నీళ్లు అందడం లేదు. పైపులైన్లు రిపేరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.మండలంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై చౌటుప్పల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో సర్పంచులు ఆరోపించారు.చౌటుప్పల్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో 35 ప్రభుత్వ విభాగాల అధికారులు ప్రగతి నివేదికలను సమర్పించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని కొంతమంది ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నలపర్వంతో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం కొనసాగింది.చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రిలో పాముకాటుకు మందు లేకుండా పోయిందని సర్పంచ్ కాయితి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అందులో డాక్టర్లు ప్రైవేటు ఆసుపత్రిలో నిర్వహిస్తూ రోగులను ప్రవేట్ ఆస్పత్రులకు వెళ్లాలని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల ప్రవేటు దావకానాల నిర్వహణపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడం శోచనీయమని ఎంపీపీ వెంకట్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ శ్వేతా ప్రియాంక ప్రజాప్రతినిధుల ప్రశ్నలపై సమాధానమిస్తూ 12 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మునుగోడు నియోజకవర్గ స్థాయిలో వంద పడకల ఆసుపత్రిని చౌటుప్పల్ లోనే ఏర్పాటు చేయాలని జడ్పిటిసి చిలుకూరు ప్రభాకర్‌రెడ్డి ప్రతిపాదన చేయగా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానం చేశారు. ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తీర్మానించారు.మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీ అవుతుంటే అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సర్పంచ్ బాతురాజు సత్యం సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.హైదరాబాదులో ఉంటూ గ్రామాల్లో స్థిర నివాసం లేని వారికి ఓటు హక్కు ఎలా కల్పించాలని ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి తహసీల్దార్ శ్యాంసుందర్‌రెడ్డిని ప్రశ్నించారు. బోగస్ ఓట్లతో గ్రామాల్లో శాంతియుత వాతావరణం చెడిపోతుందని తెలిపారు.గ్రామాల్లో డీఎల్వోలు ఓటు నమోదు చేసుకున్న వారి వద్ద వెయ్యి రూపాయలు తీసుకొని ఓట్లు నిర్ధారిస్తున్నారని తహసీల్దార్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో వెంటనే బిఎల్ఓ సమావేశం నిర్వహించి బోగస్ ఓట్ల తొలగింపు చర్యలు చేపడతామని తహసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. రేషన్ షాపులో బియ్యం పక్కదారి పడుతుందని ఎంపీటీసీ చిట్టెంపల్లి శ్రీనివాస్‌రావు ఆరోపించారు. రేషన్ బియ్యం అవసరం లేని వారికి రేషన్ కార్డులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చౌటుప్పల్ మండల సర్వేయర్ లేకపోవడంతో టీ పనులు కట్టిన రైతులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ బాతరాజు సత్యం తెలిపారు. వెంటనే చౌటుప్పల్ మండలానికి మండల సర్వేయర్‌ను నియమించాలని కోరారు. మండల సర్వసభ్య సమావేశానికి బీఆర్ఎస్ సర్పంచులు హాజరు కాలేదు.వారు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఈ సమావేశంలో జెడ్పీటీసీ చిలుకూరు ప్రభాకర్ రెడ్డి,తహసీల్దార్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఎంపీడీఓ సందీప్‌కుమార్, సింగిల్ విండో చైర్మెన్ చింతల దామోదర్‌రెడ్డి, మండల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.