Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ఎంపీటీసీలు, సర్పంచులు డిమాండ్ చేశారు.ఆదివారం నేరేడుచర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లకుమల్ల జ్యోతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. త సమావేశంలో చేపట్టిన తీర్మానాలు, లేవనెత్తిన అంశాలపై అధికారులు ఎంత మేరకు పరిష్కరించారో సభలో వెల్లడించాలని పెంచికల్‌దిన్న ఎంపీటీసీ యల్లబోయిన లింగయ్య, కల్లూరు సర్పంచ్ పల్లెపంగ నాగరాజు డిమాండ్ చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన మండల సమావేశాలకు మండల స్థాయి అధికారులు గైర్హాజరవుతున్నారని , కిందిస్థాయి ఉద్యోగులను సమావేశాలకు పంపి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపించారు. రెండు సమావేశాలకు గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసు కునేందుకు జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపామని ఎంపీడీవో శంకరయ్య సభలో వెల్లడించారు.పెంచికల్ దిన్నె గ్రామంలో రెండేండ్ల కింద రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ను వినియోగంలోకి తీసుకురాలేదని ఎంపీటీసీ లింగయ్య ప్రశ్నించగా ఏబీ స్విచ్‌ల కొరత కారణంగా ఆలస్యమైందని, మరో వారం రోజుల్లో ఏబీ స్విచ్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని ఏఈ శ్రీనివాస్ చెప్పారు.రోళ్లవారి గూడెంలో నిర్మించిన భగీరథ వాటర్ ట్యాంకులోకి నీరు సరఫరా అవుతున్నప్పటికీ ఆ ట్యాంకు ద్వారా గ్రామంలో ఇంటింటికి మంచినీటి సరఫరా పంపిణీ చేయడంలో జాప్యం కారణంగా గ్రామం మొత్తం మంచినీటి కొరత ఎదుర్కొంటుందని కో ఆప్షన్ సభ్యుడు సభ దృష్టికి తీసుకొచ్చారు.న సొంత గ్రామమైన ముకుందాపురంలో సైతం ఇదే పరిస్థితి నెలకొందని తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మహేశ్ పై ఎంపీపీ జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకరయ్య, వైస్‌ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.