Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ
నవతెలంగాణ-మోతె
పేదలకు ఉచిత వైద్యం అందించడం అభినందనీయమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు.ఆదివారం మండల పరిధిలోని రావిపహాడ్ గ్రామంలో సీపీఐ(ఎం), వ్యకాస ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ పై మల్టీ స్పెషలిస్ట్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందన్నారు. ప్రభుత్వాలు తమ బాధ్యతలను విస్మరించడం వలన పేదలకు విద్య,వైద్యం అందని ద్రాక్షలా మారాయని విమర్శించారు.పేదలకు సరైన తిండి లేక పోషకాహారలోపం, రక్తహీనతతో అత్యధికమంది మహిళలు బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వ వైద్యం పేదలకు అందకపోవటం వలన ప్రైవేటు వైద్యశాలలపై ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.ప్రయివేట్ వైద్యశాలల్లో సరైన వైద్యం చేయించుకున్నందుకు ఆర్థిక స్థోమ లేక చిన్న వయస్సులో తమ అసువులు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు,సర్పంచ్ చాములేటి కోటేష్, జెడ్పీటీసీ పందిళ్ళపల్లి పుల్లారావు,హెల్త్ పై మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ చైర్మెన్‌్ మతకాల చలపతిరావు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, ఎంపీటీసీ పద్మ మధు,బీఆర్ఎస్ మండల నాయకులు కాకి సురేందర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షులు పొడపంగి ఎలమంచి, చాట్ల మధు ,సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి కుంచం గోపయ్య,మండల కమిటీ సభ్యులు సోమగాని మల్లయ్య,డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి వెలుగు మధు, కేవీపీఎస్ మండల నాయకులు బాపనపల్లి నాగయ్య, కాంగ్రెస్ గ్రామనాయకులు కోట సుధాకర్‌రెడ్డి, న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు కోట మధుసూదన్‌రెడ్డి, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.