Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
పురుగుల మందు తాగి ఇరువురు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది.వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.ఎస్సై యాదవేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉప్పునూతల గంగరాజుకు తొమ్మిందేండ్ల కింద ఖమ్మం జిల్లా కాకరాయికి చెందిన లావణ్య(24)తో వివాహమైంది.ఆ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కూతురు జన్మించారు.ఇదే గ్రామానికి చెందిన చింతపల్లి మహేష్(21తో కొంతకాలంగా లావణ్యతో పరిచయం ఏర్పడింది.ఈ క్రమంలో వారి మధ్య లైంగిక సంబంధం ఏర్పడింది.మహేష్ వ్యవసాయం చేసుకుంటూ ట్రాక్టర్ తోలుకుంటున్నాడు.వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు.ఇటీవల లావణ్య భర్త గంగరాజుకు విషయం తెలిసి మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తానని మందలి ంచాడు.ఈ వ్యవహారం భర్తకు తెలియడంతో మహేష్,లావణ్య లు శనివారం రాత్రి ఇద్దరు ఇండ్లు విడిచి వెళ్లిపోయారు.వారి కుటుంబ సభ్యులు ఉదయం వెతికినా జాడ తెలియక పోవడంతో లావణ్య భర్త గంగరాజు స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశాడు..పోలీసులు ఇద్దరి మొబైల్ఫోన్లకు కాల్ చేసినా లిఫ్ట్ చేయక పోవడంతో పోలీసులు స్థానికుల సహకారంతో మొబైల్ లొకేషన్ ద్వారా మృతుడు మహేష్ కౌలు చేస్తున్న సోమిరెడ్డి మాధవరెడ్డి వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు.మహేష్ ,లావణ్యల మృతదేహాలను గుర్తించారు.పక్కన మోనో పురుగు మందు డబ్బాలు ఉండడంతో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అనుమానం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలకు పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. స్థానిక సర్పంచ్ ఎర్రోజు యల్లాచారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.