Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
- తనదైన మార్క్ చూపిన కమిషనర్...
- రేపు మంత్రి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం..
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
విద్యుత్తును ఆదా చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన రాష్ట్ర ఎనర్జీ కన్వర్షన్ అవార్డు 2022లో నల్లగొండ మున్సిపాలిటీ ముందు వరుసలో నిలిపేందుకు మున్సిపల్ కమిషనర్ కేవీ. రమణాచారి కషి చేశారు. తనదైన శైలిలో నల్లగొండ మున్సిపాలిటీనీ అభివద్ధి వైపు నడిపించడం వలనే నేడు నల్లగొండ మున్సిపాలిటీ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను పక్కకు నెట్టి మొదటి స్థానంలో నిలిచి గోల్డెన్ అవార్డును అందుకొనుంది. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో 48 వార్డులు ఉండగా, పట్టణంలో మొత్తం 24186 వీధి దీపాలు ఉన్నాయి. వీధి దీపాలు అన్ని 2019 నుండి ఎల్ఈడీ వెలుగులనిస్తున్నాయి. ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్‌ను ఆదా చేయడంలో గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు, అధికారులు విఫలమయ్యారు. 2019- 20 లో 18146 వీధి దీపాలు ఉండగా, 2020- 21 లో 20,946, 2021 -22లో 24,186 దీపాలు ఉన్నాయి. ప్రస్తుత నల్లగొండ కమిషనర్ కేవీ. రమణచారి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రతి పనిలో తనదైన మార్కును చూపిస్తూ వస్తున్నారు. వీధి దీపాలకు ప్రత్యేకమైన హార్డ్‌వేర్‌ను ఏర్పాటు చేయించారు. దీంతో నిర్ణీత సమయంలో దీపాలు వాటంతటవే ఆరిపోతాయి. గతంలో వీధి దీపాలు పగలు కూడా వెలుగుతూనే ఉండేవి. ఆటోమేటిక్ సిస్టం ఏర్పాటుతో విద్యుత్ పొదుపు సాధ్యమైంది. గతంలో 17.50 లక్షల రూపాయలు బిల్లు వచ్చేది. ప్రస్తుతం 16 లక్షల బిల్లు మాత్రమే వస్తూ ఉంది. అంటే లక్ష యాభై వేల రూపాయలు ప్రతి నెల ఆదా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఎనర్జీ కన్వర్షన్ అవార్డు 2022లో ప్రధమ స్థానంలో నల్లగొండ మున్సిపాలిటీ చోటు దక్కించుకుంది. మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాదులో మున్సిపల్ కమిషనర్ డాక్టర్ రమణచారి గోల్డెన్ అవార్డును అందుకోనున్నారు. గతంలో నల్లగొండ మున్సిపాలిటీకి అవార్డు రాకపోవడం, నేడు విద్యుత్ ఆదాలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచి గోల్డెన్ అవార్డు రావడం పట్ల పలువురు అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అందరి సహకారంతోనే...
డాక్టర్ కేవీ. రమణచారి (మున్సిపల్ కమిషనర్)
నల్లగొండ మున్సిపాలిటీలో అధికారులు, సిబ్బంది, ముఖ్యంగా ప్రజలు ఇలా ప్రతి ఒక్కరి సహకారంతోనే పట్టణంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. అందులో భాగంగానే వీధిలైట్లపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వీధిలైట్లన్నీ ఈఈఎస్ఎల్కు కన్వర్ట్ చేశాం. నేను గతంలో చాలా అవార్డులు తీసుకున్నాను. ఈ అవార్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నల్లగొండ మున్సిపాలిటీకి మొదటి స్థానం లభించడం, గోల్డెన్ అవార్డు దక్కించుకోవడంలో ప్రతి ఒక్కరి కృషి సహకారం ఉంది.