Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ పట్టణంలో టింబర్ డిపోలలో పనిచేస్తున్న సామిల్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ.సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సామిల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ పట్టణ విస్తృత సమావేశం ఆదివారం సుందరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాల మధ్యన టింబర్ డిపోలలో కట్టెకోత మిషన్ల దగ్గర పనిచేస్తున్నప్పుడు ప్రమాదాలు జరిగితే ఎలాంటి నష్టపరిహారాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వము నుండి ఆదుకోవడం కోసం నష్టపరిహారాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణంలో అద్దె ఇండ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామిల్ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం పట్టణ నూతన కమిటీని 9 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, అధ్యక్షులు సలివోజు సైదాచారి, ఉపాధ్యక్షులు బాగోజు నారాయణ, ఉపాధ్యక్షులు ఎస్కే. వలి, ప్రధాన కార్యదర్శి కత్తుల జానయ్య, సహాయ కార్యదర్శి ఎల్.ఎల్లయ్య, కోశాధికారి పేర్ల సైదులు, ప్రచార కార్యదర్శి పాలడుగు శ్రీను, సలహాదారులు జీ. లింగయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షులు సలివోజు సైదాచారి, లింగయ్య, జానయ్య, ఎస్కే .వలి, కోటయ్యచారి, బ్రహ్మచారి, గోవర్ధన్, మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.