Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ అన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్ఐ) సభ్యత్వ నమోదు ఆదివారం చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. అందరికీ విద్య ఉపాధి కల్పించాలని డివైఎఫ్ఐ పోరాట నిర్వహిస్తుందన్నారు. స్థానిక పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నారు. కాలుష్యంతో అనేక విధాలుగా నష్టపోతున్న స్థానికులకు మాత్రం ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసేటప్పుడు స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెబుతూ పరిశ్రమలు ఏర్పాటు చేసి నేడు ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని, వెంటనే స్థానిక పరిశ్రమలలో స్థానికల ఉద్యోగాలు కల్పించకుంటే పోరాటాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ డివిజన్ ఉపాధ్యక్షులు దేశబోయిన నరసింహ, మండల అధ్యక్షులు పంది నరేష్, నాయకులు ఆరూరి పవన్, చందు, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.