Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
అక్రమాలకు పాల్పడుతున్న గిరిజన సంక్షేమ శాఖ ఏవో పై చర్యలు తీసుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్లు డిమాండ్ చేశారు. ఆదివారం మిర్యాలగూడ రోడ్డులోని ఎస్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. నల్లగొండ గిరిజన సంక్షేమ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏవో అవినీతి అక్రమాలకు కేరప్ అడ్రస్‌గా మారారని ఆరోపించారు. తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం నియమించిన విద్యాయా వాలంటీర్ల నియామకంలో సీనియార్టీ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించాడని పేర్కొన్నారు. అంతేకాకుండా విదేశీ చదువులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే సుమారు 20 లక్షల రూపాయలను వారికి అందివ్వకుండా డబ్బుల కోసం పీడిస్తున్నాడని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుంటే అర్హత లేదు అంటూ గిరిజన విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఏవో పై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వసతి గహాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం వర్కర్లు, కాంట్రాక్ట్ వార్డెన్లు డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే రెన్యువల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఏవో పై సమగ్ర విచారణ జరిపించి తక్షణమే అతనిని సస్పెండ్ చేయాలని గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి బలమైన విద్యార్థి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గిరిజన సంక్షేమ కార్యాలయంలో పనిచేస్తున్న అవినీతి ఏవోను సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు మూడవత్ జగన్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఆకాష్, అఖిల్ రాఖి, తరుణ్, కార్తీక్, శ్రీను, మహేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.