Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 19వ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా నాయకులు ఉడుగుంట్ల రాములు అన్నారు. ఆదివారం చింతపల్లి మండలంలోని కురంపల్లి గ్రామంలో వ్యవసాయ కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడే సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్క వ్యవసాయ కార్మికుడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై పోరాడే పోరాడాలన్నారు. అనంతరం మండల వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా బొత్తల యాదయ్య, కార్యదర్శి పోలే యాదయ్య, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరయ్య, పడకండి కృష్ణయ్య, జైలాల్, వారాల చిన్న రామచంద్రం, వారాల శీను, దార్ల మురళి, చంద్రయ్య తదితరులున్నారు.
మర్రిగూడ : ఈనెల 19, 20 తేదీలలో కట్టంగూరు మండల కేంద్రంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘ 19వ మహాసభల కరపత్రాన్ని ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలో ఆ సంఘం కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల వెంకటరామ్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మర్రిగూడ మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు నీలకంఠం రాములు, ఎడ్ల అంజయ్య, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.
త్రిపురారం : ఈనెల 19, 20 తేదీలలో కట్టంగూరు మండలం కేంద్రంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నేపాక సైదులు పిలుపునిచ్చారు. ఆదివారం త్రిపురారం మండల కేంద్రంలో మహాసభల కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి వ్యవసాయ రంగం నిర్వీర్యం చేసిందని ఉపాధి హామీ పనులను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దైద శ్రీను, వ్యకాస మండల కార్యదర్శి వల్లపు వెంకటయ్య, అన్నపాక వెంకన్న, కుమ్మరి సోమమ్మ, బైరం నవనీత, తిరుపతమ్మ, నాగయ్య, ముత్తయ్య, నాగమ్మ, తదితరులు పాల్గొన్నారు.