Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లులక్ష్మీ
నవతెలంగాణ-కోదాడరూరల్
కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులపైన దాడి చేస్తూ రాజ్యాంగానే మార్చే ప్రయత్నం చేస్తున్న విధానాలను తిప్పి కొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. ఆదివారం పట్టణంలోని సుందరయ్య భవనంలో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగంపైన దాడి చేస్తూ పార్లమెంట్లో పార్లమెంటు సభ్యులను డబ్బుతో కొనుగోలు చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీకి అనుకూలంగా మార్చుకోవాలనే ప్రయత్నం చేస్తుందని, ఆ ప్రయత్నాన్ని ప్రజలు, ప్రజాతంత్ర వాదులు తిప్పి కొట్టాలన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్ల కాలంలో 8 ప్రభుత్వాలను కూల్చివేసిందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రోల్, నిత్యావసర ధరలు పెంచుతూ ప్రజల పైన అనేక భారాలు మోపుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని, ఇలాంటి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో రైతు వయసుతో సంబంధం లేకుండా రైతులకు రైతుబంధు అమలు చేయాలని, ఇంటి జాగా ఉన్న ప్రతి వ్యక్తికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, జుట్టుకొండ బసవయ్య, కోట గోపి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు, పట్టణ కార్యదర్శి మిట్ట గనుపుల ముత్యాలు, రైతు సంఘం జిల్లా నాయకులు ఏనుగుల వీరాంజనేయులు, వీ. నారాయణ తదితరులు పాల్గొన్నారు.