Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఈవో నారాయణరెడ్డి
నవతెలంగాణ-మోత్కూరు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల ఉన్నతికి దాతలు చేయూతనివ్వాలని యాదాద్రి డీఈవో కె.నారాయణరెడ్డి కోరారు. గురువారం మున్సిపల్ కేంద్రంలోని అంగడిబజారు ప్రాథమిక పాఠశాలలో దాత రిటైర్డ్ లెక్చరర్ వడ్డేపల్లి లక్ష్మీ నర్సయ్య రూ.2 లక్షలు ఖర్చు చేసి స్మార్ట్ టీవీ, వాటర్ ఫిల్టర్, మైక్ సెట్, విద్యార్థులకు నోట్ బుక్స్, టై, బెల్టులు అందజేశారు. ఈ సందర్భంగా దాత లక్ష్మీ నర్సయ్య దాతృత్వాన్ని గుర్తించి గురువారం పాఠశాల ఆవరణలో డీఈవో చేతుల మీదుగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన కోసం ప్రభుత్వం మన ఊరు మనబడి లాంటి కార్యక్రమాలు చేపట్టి పాఠశాలలను అభివృద్ధిచేస్తుందని, దాతలు కూడా ముందుకొచ్చి చేయూతనిచ్చినట్టయితే ఉత్తమ పాఠశాలలుగాతీర్చిదిద్దవచ్చన్నారు. పాఠశాల హెచ్ఎం ఆర్.రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సన్మాన సభలో మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి, వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీ నర్సింహారెడ్డి, ఎంపీడీవో జి.చంద్రమౌళి, ఎంఈవో వి.శ్రీధర్, పీఆర్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి డి.వెంకటయ్య, మండల అధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు కె. అరుణాదేవి, సౌజన్య, జ్యోతి, లలిత తదితరులు పాల్గొన్నారు.