Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరి రూరల్
మండలంలోని వడపర్తి గ్రామంలోని శ్రీనివాస రామానుజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో గురువారం పాఠశాల 11 వ వార్షికోత్సవ వేడుకలు, గణిత దినోత్సవం, సైన్స్ ఫెయిర్ వేడుకలను నిర్వహించారు. భువనగిరి ఎంఈఓ బి లక్ష్మీనారాయణ హాజరై సైన్స్ ఫెయిర్ ను ప్రారంభించి, మాట్లాడారు. నేటి సమాజంలో నవభారత నిర్మాతలు విద్యార్థులని అన్నారు. గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కష్ణారెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ స్కూల్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో నాణ్యమైన విద్యను అందిస్తుందన్నారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ దాసరి శ్రీరాములు మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన నైపుణ్యం గల విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా శ్రీనివాస రామానుజన్ స్కూల్ పనిచేస్తుందని తెలిపారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బొబ్బిలి మన్నెమ్మ రాములు యాదవ్ స్కూల్ డైరెక్టర్లు పాండాల రాజకుమార్ గౌడ్, దొమ్మాటి శ్రీశైలం, ఉపాధ్యాయులు బి రజినీకాంత్, డి వెంకటేశం, భాస్కర్, పుణ్యవతి, భవాని, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.