Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సంస్థాన్‌నారాయణపురం
24 గంటల కరెంటును ఇవ్వడం లేదంటూ మండలంలోని జనగాం గ్రామ రైతులు గురువారం స్థానిక సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 15 రోజులుగా కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదన్నారు. త్రీఫేస్ కరెంటుకు బదులు సింగిల్ ఫేస్ కరెంటుతో కలిపి 24 గంటలు ఇస్తున్నట్లు విద్యుత్ ఏ ఈ తమకు సమాధానం ఇచ్చాడని రైతులు తెలిపారు. సింగిల్ ఫేస్ కరెంటుతో తమకు ఎలాంటి ఉపయోగం లేదని 15 రోజులుగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్య సమాధానంతో తమ నారు మళ్ళు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేసి పంట పొలాలను కాపాడాలని కోరారు.