Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు ముంగిడి సునీత
నవతెలంగాణ- ఆలేరుటౌన్
తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ఆలంబిస్తున్న కక్షపూరితమైన చర్యలను ప్రజల్లో ఎండగడతామని రాష్ట్ర ప్రభుత్వ విప్ ,ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.గురువారం పట్టణకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉపాధి హామీ పనుల పైన కేంద్రం దుష్ప్రచారానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శుక్రవారం చేపట్టనున్న ఆంధ్రాలో ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పంట కల్లాలను కడితే, కేంద్రానికి ఎందుకుకడుపు మంట అని నిలదీశారు. ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తున్నదన్నారు. రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉండే వ్యవసాయ కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో నిర్మిస్తున్న కల్లాలకు అభ్యంతరం చెప్పని మోడీ సర్కారు, తెలంగాణ రైతులు కట్టుకున్న కల్లాలకు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధించాలని తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ తరఫున ఎన్నో ఏండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు, వ్యవసాయానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే తమ సూచనలను కేంద్రం పట్టించుకోకుండా,ఉపాధి హామీని నీరుగార్చే కుట్రలు కొనసాగిస్తుందని ఎండగట్టారు . మరోపైపు పెరిగిన ఎరువులు పెట్రోల్ ధరలు, ఇతర ఖర్చుల పెరుగుదల వలన వ్యసాయరంగం పంట పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు. కనీసం ఇప్పుడైన రైతులను అదుకునేందుకు వ్యవసాయంతో ఉపాధి హమీని అనసంధానం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులంటేనే కేంద్రానికి గిట్టడం లేదన్నారు. కేవలం తెలంగాణ మీద వివక్షతోనే పనికిమాలిన షరతులను మోడీ సర్కారు తెరపైకి తెస్తుందని మండిపడ్డారు. ఇందులో భాగంగా 750 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో నిర్మించాలనుకున్న 79000 వ్యవసాయ కల్లాల నిర్మాణాలను మోడీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. వ్యవసాయ కల్లాల నిర్మాణంకు ఖర్చయిన కే,151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న ఈ వివక్షపూరిత వ్యతిరేక వైఖరికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పురపాలక సంఘం చైర్మెన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం, వార్డు కౌన్సిలర్ బేతి రాములు, కసగళ్ల అనసూయ, మామిడాల అంజయ్య, కోటగిరి ఆంజనేయులు, ముదిగొండ శ్రీకాంత్, మర్తాల రమణారెడ్డి,లక్ష్మీనారాయణ, చిమి. శివ మల్లు,నరేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.