Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ఈనెల 29, 30, 31 తేదీల్లో ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కూకుట్ల చొక్కాకుమారి పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మహాసభలను పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చొక్కాకుమారి మాట్లాడుతూ అనేక మంది వ్యవసాయ కూలీలకు నేటికి సెంట్ భూమిలేని పరిస్థితి ఉన్నదన్నారు. మండలంలో కొనసాగుతున్న భూపంపిణీ నిషేధాన్ని ఎత్తివేసి ముత్తిరెడ్డిగూడెంలో సర్వే నెంబర్ 257 లో ఉన్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని భూమి లేని వారికి పంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెరుగు లక్ష్మమ్మ , కంచర్ల మమత,దేశెట్టి పద్మ, కొండ లక్ష్మమ్మ,పుల్లెల సంతోష , పుల్లెల ఇంద్రమ్మ , కొండమడుగు కమలమ్మ , ఎంకర్ల మాధవి, కొండ కౌసల్యా, కొండ లావణ్య, కొండ సావిత్రి,మెడమైన కనుకమ్మ, నవ్య, కలమ్మ పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : ఆలేరు మండలంలోని పటేల్ గూడెం ,గుండ్ల గూడెం, శ్రీనివాస్ పురం ,కంది గడ్డ తండా గ్రామాలలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు ఆవిష్కరించి గోడలకు అతికేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సమస్యలపై సమరశీల పోరాటాలు రాష్ట్ర మూడో మహాసభ రూపకల్పన చేస్తుందని చెప్పారు .ఈనెల 29 30 31 తేదీలలో ఖమ్మం జిల్లాలోని వేసవి కార్మిక సంఘం రాష్ట్ర మూడవ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొమ్మ కంటి లక్ష్మీనారాయణ, జిల్లా నాయకురాలు కేతావత్తు లక్ష్మి , గ్యార విజయ, చౌడబోయిన సుధాకర్, యాదగిరి ,సత్తయ్య ,మాలోత్ విజరు ,రమేష్, గమ్లి, చిక్కిల్లు ఉపేంద్ర ,కేతావత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.