Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద రిక్వెస్ట్ బస్టాండ్‌ను పూర్తిస్థాయిలో నిర్మాణం చేయాలని ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలోగురువారం కళాశాల ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ వలిగొండ మండలంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద తొమ్మిదేండ్ల క్రితం రిక్వెస్ట్ బస్టాండ్ మంజూరైందన్నారు. పనులు మొదలు పెట్టి మధ్యలో వదిలేసిన పరిస్థితి ఉందన్నారు. బస్టాండ్ నిర్మాణం అయేంతవరకు కళాశాల వద్ద విద్యార్థులకనుగుణంగా బస్సులు ఆపి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు మండల సహాయ కార్యదర్శి పోలేపాక విష్ణు,సీరి,సాయి ,సందీప్, సాయి, తదితరులు పాల్గొన్నారు.