Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ దీపక్తివారీ
నవతెలంగాణ -గుండాల
మన ఊరు మన బడిలో ఎంపికైన పాఠశాలల్లో మరమ్మతుల పనులను సత్వరమే పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. గురువారం మండలంలోని గుండాల,పెద్దపడిశాల ప్రాథమిక పాఠశాలల్లో పనులు పరిశీలించిన ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ గుండాల పాఠశాల పనులు జిల్లాలోనే వెనుక పడిందని,సత్వరమే పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ ఏఈ దామోదర్ పై మండిపడ్డారు. పనులలో వేగం పెంచాలని,అలసత్వం వహిస్తే సహించేది లేదని, ఫిబ్రవరి 15 లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి,ఎంపీడీఓ శ్రీనివాస్,ఎంఈఓ శ్రీధర్,ప్రధానోపాధ్యాయులు ఎ.మాధవరెడ్డి, ఎ.శ్రీనివాసరెడ్డి, మండల పరషత్ కో ఆప్షన్ సభ్యుడు ఎం.డీ షర్ఫొద్దీన్, పెద్దపడిశాల ఉపసర్పంచ్ బందెల ప్రమోద్ గ్రామస్తులు చిందం ప్రకాష్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.