Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ మండలంలోని చందనపల్లి గ్రామంలో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని లక్ష్యంతో శుక్రవారం గుడ్ సమార్టర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ శిబిరంలో ప్రజలకు రక్త పరీక్షలు, బీపీ షుగర్ పరీక్షలు, కంటి పరీక్షలు అద్దాల పంపిణీ తో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు తీగల జాన్ శాస్త్రి, ట్రస్టు నిర్వాహకులు మార్టిన్ శాస్త్రి, కెనాడి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గాదె రామ్ రెడ్డి, సర్పంచ్ సురిగి మన్నెమ్మ, ఎంపీటీసీ పెద్ది ఇందిరమ్మ వెంకటయ్య, కోట్ల జయపాల్‌రెడ్డి, గాదె రాజశేఖర్‌రెడ్డి, ఉప్పల మురళి, రమేష్ ప్రభాకర్ మధుసూదన్‌రెడ్డి, కర్ణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.