Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్
నవతెలంగాణ-హలియా
గిరిజనులకు వెంటనే డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్‌నాయక్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 ఏండ్లవుతున్నప్పటికీ గిరిజనులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు. శుక్రవారం అనుముల మండలం ఈశ్వర్ నగర్లో తెలంగాణ గిరిజన సంఘం కమిటీ ఆధ్వర్యంలో గిరిజన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ ఇల్లు లేని గిరిజనులు పేదలకు మాకు ఓటేసి గెలిపిస్తే డబల్ బెడ్ ఇల్లు ఇస్తామని చెప్పి నేటికీ ఎనిమిది ఏండ్లవుతున్నా ఒక్కరికి కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరిగిన ధరల కనుగుణంగా ఒక పేదవాడు గిరిజనుడు ఇల్లు కట్టుకోవాలంటే అతని తరం మొత్తం కష్టపడ్డా ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఈశ్వర్ నగర్లో గిరిజనులు గుడిసెలలోనే జీవనం కొనసాగిస్తున్నారని, ఇది పాలకుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు రమావత్ నరేష్‌నాయక్, మండల నాయకులు కొర్ర రాజునాయక్, రామవత్ రామునాయక్, సునీత, పావని, నాగునాయక్, సుశీల, తారు తదితరులు పాల్గొన్నారు.