Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ రద్దుతో బీజేపీ కోట్లది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. శుక్రవారం మిర్యాలగూడలో నియోజవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రభుత్వ పాఠశాలలో కోట్లాది మంది అణగారిన, పేద వర్గాల విద్యార్థులు చదువుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించేందుకు గతంలో ప్రి మెట్రిక్ విద్యార్థులకు స్కాలర్ షిప్లు ఇచ్చేదని, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ రద్దు చేయడం అన్యాయమన్నారు. మనువాద కుట్రల్లో బాగంగా దళిత విద్యార్థులను విద్యకు దూరం చేయడానికి బిజెపి కంకణం కట్టుకుందన్నారు. ప్రీ మేట్రిక్ స్కాలర్ షిప్ లను ఇవ్వాలని, లేని పక్షంలో బీజేపీని అడ్డుకొని వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పిస్ రాష్ట్ర నాయకులు కత్తుల తులసి దాస్, దైద రవి, రవీందర్ మిర్యాలగూడ నియోజకవర్గం ఇంచార్జి రామాంజి సైదులు, పరంగి రంజిత్, అదిమల్ల నగేష్, ఏరపుల వెంకన్న, సత్యం, పౌల్, మీసాల సైదులు, గూడూరు లక్ష్మయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.