Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
గ్రంథాలయ సభ్యత్వ నమోదులో నల్లగొండ జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి గ్రంథపాలకులందరూ కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రెగట్టే మల్లిఖార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన గ్రంథపాలకుల సమీక్షసమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. గ్రంథాలయ సభ్యత్వ నమోదు వలన ప్రజల్లో గ్రంథాలయాల పట్ల అవగాహాన పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వివిధ నోటిఫికేషన్లు ఇస్తున్నందున ఎప్పటికప్పుడు కొత్త పుస్తకాల జాబితాలను కార్యాలయానికి పంపాలని గ్రంథపాలకులను ఆదేశించారు. ప్రతి గ్రంథాలయంలో సభ్యత్వ నమోదు తప్పని సరిగా చేయడమే గాకుండా నిర్ధేశించిన లక్ష్యానికి చేరుకున్న గ్రంథపాలకులకు అవార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ సీబీఎఫ్ నిధులతో నిర్మించిన మహిళల టాయిలెట్లను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బీ. బాలమ్మతో కలిసి చైర్మెన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన గ్రంథపాలకులు పాల్గొన్నారు.