Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
నల్లగొండ పట్టణంలోని 5వ వార్డులో గల రెవెన్యూ కాలనీలో ట్రీ పార్క్, స్ట్రీట్ లైట్స్, ఎవెన్యూ ప్లాంటేషన్ త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మున్సిపల్ కమిషనర్ కేవీ.రమణచారి ఆదేశించారు. హరిత శుక్రవారంలో భాగంగా పట్టణంలోని 5 వ వార్డులో పర్యటించారు. కాలనీవాసులు తన దృష్టికి తీసుకు వచ్చిన సమస్యలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులతో కలిసి మొక్కలు నాటారు. ప్రజలందరూ తమ ఇంటి పరిసరాలలో ఉన్న మొక్కలను సంరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 5 వార్డ్ కౌన్సిలర్ పున్న గణేష్ కుమార్, డీఈలు వెంకన్న, నరసింహారెడ్డి, ఏఈ రవీందర్, ఏసీపీ నాగిరెడ్డి, జేపీవో ఖాదర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు మూర్తుజ, శంకర్, మెప్మా, హరితహారం, పారిశద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వార్డ్ వాచ్...
వార్డ్ వాచ్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ కేవీ.రమణచారి శుక్రవారం పట్టణంలోని 11 వార్డులో పర్యటించారు. వార్డ్ కౌన్సిలర్, వార్డు ప్రజలతో కలిసి వార్డును పరిశీలించి వార్డులలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని ఒక వీధిలో సీసీ రోడ్డు, సీసీ డ్రయిన్ నిర్మించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శానిటరీ సిబ్బంది వార్డు మొత్తం శుభ్రపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డ్ కౌన్సిలర్ కంకణాల లక్ష్మమ్మ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.