Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తోందని గుత్త మెమోరియల్ ట్రస్ట్ చైర్మెన్ గుత్త అమిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దేహదారుడ్య పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన పౌష్టిక ఆహారం పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసిందని తెలిపారు. తమ ట్రస్ట్ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు సేవ చేయడానికి గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుందని, ఎలాంటి సహాయసహకారాలు కావాలన్న సంప్రదించా లన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దుబ్బ అశోక్ సుందర్, కంచరకుంట్ల గోపాల్‌రెడ్డి, ఐతగోని స్వామిగౌడ్, యామ దయాకర్, మందడి మధుసూదన్‌రెడ్డి, హరికృష్ణ, నూనె రవీందర్, చిలుకరాజు శ్రీనివాస్, బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు బషీరుద్దీన్, హన్ను, రిటైర్డ్ వార్డెన్స్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇంద్రసేనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.