Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో తగ్గిన నేరాలు
- ఈ ఏడాది 7,343 కేసులు నమోదు
- ఉప ఎన్నికలో రూ.2,27,10,620 నగదు సీజ్
- విలేకరుల సమావేశంలో ఎస్పీ రెమా రాజేశ్వరి
నవతెలంగాణ-నల్లగొండ
శాంతి భద్రత పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని, ఆ పని తీరుతోనే జిల్లాలో 2022లో నేరాల సంఖ్య తగ్గిందని నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాన్యువల్ క్రైం మీటింగ్‌లో ఆమె ఈ ఏడాది కేసుల వివరాలను వెల్లడించారు. 2021లో మొత్తం 9,535 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 7,343 కేసులు నమోదయ్యాయన్నారు. హెడ్ వైస్‌గా చూస్తే డెకాయిట్ 1, రాబరి 1, పగలు చోరీలు 49, రాత్రి చోరీలు 129, సాధారణ చోరీలు 323, మర్దర్ కేసులు 35, కల్పబుల్ హౌమీసైడ్ 4, రియోటింగ్ 14, కిడ్నాపింగ్, అబ్డక్షన్ 66, రేప్ కేసులు 84, గ్రీవియస్ హాట్ 52, సింపిల్ హాట్ 850, చీటింగ్ 459, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 15, కౌంటర్ ఫీట్కరెన్సీ 1, అటెంప్ట్ టూ మర్డర్ 57, ఫాటల్ రోడ్ యాక్సిడెంట్స్ 348, నాన్ఫాటల్ రోడ్ యాక్సిడెంట్స్ 708, అదర్ ఐపీసీ 2442, ఎస్ఎల్ఎల్ 179, మిస్సింగ్ కేసులు 456, ఫైర్ యాక్సిడెంట్స్ 16, బర్న్స్ 1, 151 సీఆర్ పీసీ 588, 174 సీఆర్పీసీ 465 కేసులు నమోదయ్యాయన్నారు. అదే విధంగా మునుగోడు ఉప ఎన్నికను పకడ్బంధీగా నిర్వహించామని, 3514 మంది సిబ్బంది ఎన్నికల బందోబస్తు నిర్వహించారన్నారు. ఈ ఎన్నికలలో మొత్తం రూ.2,27,10,620 విలువైన సామాగ్రి, లిక్కర్ ను సీజ్ చేశామన్నారు. అదే విధంగా టీఎస్ఎల్ఆర్బీ విడుదల చేసిన ఎస్ఐ, పీసీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న 40వేల మందిలో 26,433 మంది అభ్యర్థులు అర్హత సాధించగా వారికి దేహాదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గణేష్, రంజాన్, దసరా, బతుకమ్మతో పాటు అన్ని పండుగలు, ఉర్సు ఉత్సవాలు, జాతరలను కూడా ఎటువంటి ఘర్షనలు లేకుండా నిర్వహించామన్నారు. దేవరకొండ పీఎస్ పరిధిలో నవజాత శిశువులను విక్రయించే 5 మంది ముఠా సభ్యులనుఅరెస్టు చేశామని, మిర్యాలగూడలో లారీల దొంగతనానికి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చ ఏసి 24లక్షల విలువైన లారీలనుస్వాధీనం చేసుకున్నామని, కార్ల నెంబర్లు మార్చి కార్లను విక్రియిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకుని వారి నుంచి రూ.6.20 కోట్ల విలువైన 23 కార్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మిర్యాలగూడ రూరల్‌లో బైక్‌లపై తిరుగుతూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకుని వారి నుంచి 40 తులాల 24 పుస్తెల తాళ్లను, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది 496 చోరీలలో రూ.5,14,67,834 విలువైన సొత్తు చోరీ కాగా అందులో రూ.2,27,43,474 సొత్తును రికవరీ చేశామన్నారు. అదే విధంగా గంజాయి అక్రమ రవాణాకు టాస్క్‌ఫోర్స్ బంధాలను ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణా చేసే 23 కేసులలో 101 డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసి 2795.856 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అదే విధంగా 139 పీడీఎస్, 310 అక్రమ ఇసుక రవాణా, 33 గుట్కా, 26 గేమింగ్ యాక్ట్, 25 యానిమల్ క్రూయంట్లీ, 6 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా 87,375 ఎంవీ యాక్ట్, 14,858 డ్రంకెన్‌డ్రైవ్, 13,725 ఈ పెట్టి కేసులను నమోదుచేశామన్నారు. మహిళల రక్షణ కోసం షీటీమ్ నిరంతరం పని చేస్తుందని ఈ ఏడాది 58 కేసులు నమోదు చేశామని, 320 మందికి కౌన్సిలింగ్ ఇచ్చామని, 750 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించామన్నారు. ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా 230 మందిని చేరదీశామన్నారు. ఈ ఏడాది 303 ఫాటల్ యాక్సిడెంట్లలో 320మంది చనిపోగా , నాన్ ఫాటల్ యాక్సిడెంట్లలో 483 ప్రమాదాలలో 704 మందది గాయపడ్డారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 6060 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే గ్రీవెన్స్‌లో భాగంగా 1424 పిటీషన్లను స్వీకరించి పరిష్కార మార్గాలు చూపామన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, ప్రజా సౌకర్యార్థం అమరవీరుల స్మారక క్యాంటీన్ ప్రారంభించామన్నారు. నూతన డీపీఓ భవన నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపామని, రానున్న ఏడాదిలో కూడా మెరుగైన సేవలందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ ప్రసాదరావు, నల్లగొండ డీఎస్పీ నరసింహారెడ్డి, దేవరకొండ డీఎస్పీ నాగేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ మొగులయ్య, డీసీఆర్బీ డీఎస్పీ రమేష్, ఏఆర్ డీఎస్పీ సురేష్ తదితరులు ఉన్నారు.