Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య
నవతెలంగాణ-నకిరేకల్
ఈ నెల 29, 30, 31 తేదీలలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు ఖమ్మంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకులు ఓట్లప్పుడు మాయమాటలు చెప్పి ఎన్నికల అనంతరం వారిని విస్మరించడం జరుగుతు న్నదన్నారు. పాలకుల మెడలు వంచి పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయం పై ఆధారపడిన కూలీల పరిస్థితి మరి దుర్భరంగా మారిందని, వారికి ఉపాధి హామీ పథకంలో పని కల్పించి వేతనాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేసవి కార్మికుల కూలీరెట్లు పెంపుదల చేయాలన్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఈ మహాసభలో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు ఉద్యమాల కార్యచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. 29న లక్షలాది మంది వ్యవసాయ కార్మికులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్టు తెలిపారు. వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన వెంకులు, కేతపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు చింతపల్లి లూర్ధుమారయ్య, చౌగోని నాగయ్య, నార్కట్‌పల్లి మండల అధ్యక్ష, కార్యదర్శులు చెరుకు పెద్దులు, దండు నాగరాజు, నాయకులు అధిమల్ల సుదీర్, మర్రి బక్కయ్య, పుట్ట సత్తయ్య పాల్గొన్నారు.
దామరచర్ల :
ఈనెల 29, 30, 31 తేదీలలో ఖమ్మంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహా సభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు మాలోతు వినోద్ నాయక్ కోరారు. గురువారం స్థానిక వ్యవసాయ కార్మిక సంఘం కార్యాలయంలో రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుట్ల సైదులు, కందుకూరి రమేష్ బాబు, దామరచర్ల అధ్యక్ష, కార్యదర్శులు కందుగుల హనుమంతు, గోపి, బంటు గోపాల్, బారెడ్డి నర్సిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ :
ఈనెల 29, 30, 31 తేదీలలో ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లుట్ల సైదులు, జిల్లా కమిటీ సభ్యులు కందుకూరి రమేష్‌బాబు కోరారు. అడవిదేవులపల్లి మండల కేంద్రంలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వ్యవసాయ కార్మికుల సమస్యలపై ఈ మహాసభలో సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తు ఉద్యమాల కార్యచరణ రూపొందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పీ. నర్సయ్య, ఆర్.రంగా, ఏ. హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
చిట్యాలటౌన్ :ఈనెల 29 నుండి 31 వరకు ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగస్వామి పిలుపునిచ్చారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలో మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షులు కల్లూరి కుమారస్వామి, ఆరూరి శంభయ్య, గుడిసె లక్ష్మీనారాయణ, లడే శ్రీనివాస్, ఆరూరి నరసింహ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి :ఈనెల 29, 30, 31, వ తేదీలలో ఖమ్మం జిల్లాలో జరిగే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘం కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాములు, పర్వతం ఆంజనేయులు, శివ, కోటమ్మ, సుజాత, సైదమ్మ, శైలజ, తదితరులు పాల్గొన్నారు.