Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24 గంటల్లో 9 గంటలే త్రీపేజ్ కరెంట్
- ఇబ్బందులు పడుతున్న రైతులు
రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామంటున్న ప్రభుత్వం ఆచరణలో 9గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. గతంలో 12 గంటలు విద్యుత్ రైతులకు అందుబాటులో ఉండేది. కానీ రబీ పంట సాగు ప్రారంభమైనప్పటి నుండి కరెంట్ కోతలు విధిస్తున్నారు.
నవతెలంగాణ-ఆలేరురూరల్
ఆలేరు మండలంలోని 14 గ్రామపంచాయతీలు ఉన్నాయి.మండలంలో మొత్తం 6000 బోరు మోటార్లు, బావి మోటార్లు ఉన్నాయి. 24 గంటల కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ 9 గంటలు మోటార్లు నడవడానికి విద్యుత్ అందిస్తుంది .15 గంటలు టుఫెస్ కరెంట్ ఉంటుంది. 24 గంటల్లో రెండు గంటలు పూర్తిగా కోత విధిస్తున్నారు. రైతు ఉదయం లేవగానే పొలం దగ్గరికి వచ్చేసరికి కరెంటు లేకపోవడం బాధాకరం అంటున్నారు .గతంలో రాత్రి 11 గంటలకు త్రీఫెస్ కరెంట్ ఇచ్చేవారు. ప్రస్తుతం ఉదయం ఇస్తున్నారు. 10 గంటల సమయం నుండి మధ్యాహ్నం మూడు గంటల దాకా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో పోలాలు తడారిపోతున్నాయి. కరెంటు వచ్చి పోవడంతో మోటార్లు అధికంగా కాలిపోతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. రిపేరు చేయించాలంటే మోటారుకు దింపి ఎక్కించాలంటే ట్రాక్టర్ 5000 నుండి 7000 వరకు ఖర్చు వస్తుందని పేర్కొంటున్నారు. రోజుకు 12 గంటలు త్రీఫెస్ కరెంటు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.
కరెంట్ వచ్చిపోతుండడంతో మోటార్లు కాలిపోతున్నాయి
శరాజి పేట రైతు బత్తుల నరేందర్ రెడ్డి
రబి పంట సాగు చేయగానే కరెంటు తొమ్మిది గంటలు మాత్రమే వస్తుంది. అది కూడా 30 నిమిషాలకు ఒకసారి పోతుంది. ఆటోమేటిక్ స్టార్టర్ బిగిస్తే కరెంటు వచ్చి పోవడంతో వెయిట్ పడి మోటర్లు కాలిపోతున్నాయి.
కరెంటు ఇవ్వకపోవడం వల్ల పంట వెనుకకు వస్తుంది..
మామిడల రవేందర్. శర్బనపురం రైతు..
12 గంటల కరెంటు సాఫీిగా ఉంటే ఎప్పుడో పొలం దున్నేవాడిని. కరెంటు కోత వల్ల వరి పంట వెనుకకు పెట్టాల్సి వస్తోంది. నెలరోజుల లోపు వరి నారు పెట్టాలి. నారు ముదిరిపోతుంది. కరెంటు కోత వల్ల పొలం తడవలేదు.
కరెంటు కోత నివారించాలి
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుపటి వెంకటేష్
24 గంటల కరెంట్ ఇస్తానన్న ప్రభుత్వం కేవలం 9 గంటలు మాత్రమే ఇస్తుంది. మున్ముందు ఎండలు అధికంగా కొడ్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు 12 గంటలు కరెంట్ సరఫరా చేయాలి.
నిబంధనల ప్రకారం కరెంట్ సరఫరా చేస్తున్నాం
విద్యుత్ మండల అధికారి శ్రీనివాస్
గవర్నమెంట్ పై నుండి రైతులకు ఎంత విద్యుత్ అందించాలని సమాచారం ఇవ్వడంతో మేము అంతే విడుదల చేస్తున్నాం. మున్ముందు టైమింగ్ ఇంకా తగ్గించాల్సి వస్తది. ఎల్సీ తీసుకున్నప్పుడు మోటార్లు కాలిపోతున్నాయని రైతులు నా దృష్టికి తీసుకురాలేదు. ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం.