Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వలిగొండరూరల్
హాస్టల్లో ఫుడ్ పాయిజన్‌కు గురైన విద్యార్థులను శుక్రవారం ఎస్ఎఫ్ఐనాయకులు పరామర్శించారు. ఈసంద ర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ మూడు రోజులుగా వరుసగా అన్నంలో పురు గులు వస్తున్నాయని విద్యార్థులు వార్డెన్‌కు చెప్పితే తాత్కాలికంగా మార్చారన్నారు. కానీ ఆ తెచ్చిన రైస్ కూడా నాణ్యమైనది కాకపోవడంతో ఫుల్లటి పులుపున్న రసం పెట్టడంతో అది పిల్లలు తినగా 13 మందికి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. డీఈఓ వెంటనే తెలంగాణ మోడల్ స్కూల్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడి హాస్టల్లోని విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు నాయకురాలు డి.నేహా,మండల సహాయకార్యదర్శి పోలేపాక.విష్ణు,కళాశాల కో-కన్వీనర్ భార్గవి, కళాశాల నాయకత్వం పాల్గొన్నారు.